పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు.
పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నెల్లూరు పట్టణంలోని పెన్నా నదిలో కొవ్వూరుకు చెందిన నలుగురు స్నేహితులు ఈత కొట్టడానికి దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. ముగ్గురు గల్లంతయ్యారు. అందులో పి. వర్షిత్(14) అనే బాలుడి మృతదేహం లభించగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.