కృష్ణాజిల్లా శివాలయంలో చోరీ | theft in krishna district lord siva temple | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా శివాలయంలో చోరీ

Feb 7 2016 4:19 PM | Updated on Sep 3 2017 5:08 PM

కృష్ణాజిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. కైకలూరు మండలం భుజదలపేట గ్రామంలోని పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు.

కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. కైకలూరు మండలం భుజదలపేట గ్రామంలోని పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు.

అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు రూ. 70 వేలు విలువ చేసే ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఆలయ తాళాలు పగులగొట్టి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు... క్లూస్‌టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement