కడియం మండలం వ్యామగిరి గ్రామంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది.
కడియం మండలం వ్యామగిరి గ్రామంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో దొంగలు జొరబడి 100 కాసుల బంగారు, 6 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. ఉదయం గమనించిన రావిపాటి రామచంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.