పూజారి కలకలం | The priest suicide note | Sakshi
Sakshi News home page

పూజారి కలకలం

Feb 1 2015 3:01 AM | Updated on Sep 2 2017 8:35 PM

పూజారి కలకలం

పూజారి కలకలం

మదనపల్లెకు చెందిన ఆలయ అర్చకుడు నాలుగురోజుల క్రితం అదృశ్యం కావడం.. శనివారం ఫేస్‌బుక్‌లో ఆయన సూసైడ్ నోట్ కనబడడంతో కలకలం రేగింది.


 మదనపల్లె/రూరల్: మదనపల్లెకు చెందిన ఆలయ అర్చకుడు నాలుగురోజుల క్రితం అదృశ్యం కావడం.. శనివారం ఫేస్‌బుక్‌లో ఆయన సూసైడ్ నోట్ కనబడడంతో కలకలం రేగింది. ఇంతకూ ఆయన ఏమయ్యాడో తెలియక మదనపల్లె  వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం రేగింది. తమ చావుకు ఆలయ కమిటీ సభ్యులే కారణమని తాము నమ్ముకున్న బాబా పాదాలచెంతకే శాశ్వతంగా వెళ్లిపోతున్నామని సూసైడ్‌నోట్ రాసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఇండియాలోనే మొట్టమొదట మదనపల్లె బర్మావీధిలో నిర్మించిన సాయిబాబా ఆలయంలో ఊహ తెలిసినప్పటి నుంచి చిప్పిలికి చెందిన శివస్వామి ప్రధాన అర్చకుడిగా పనిచేసేవారు. ఈ క్రమంలో ఆలయంలో బాబాతో తీసిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశార ు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు శివస్వామి ఇక మీదట బాబాకు అర్చకుడిగా ఉండరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేల బాబాకు సేవలందించాలంటే ఆలయ కమిటీ సభ్యుల పాదాలకు మొక్కాలని వేధించ సాగారు.

ఈ విషయాన్ని జీర్ణీంచుకోలేని శివస్వామి బాబాకు సేవలందించిన తాను కమిటీ సభ్యుల పాదాలు పట్టుకోనని తేల్చిచెప్పారు. అప్పటి నుంచి శివస్వామి ఆలయానికి రాలేదు. శివస్వామే కాకుండా అతని భార్య జ్యోతి కూడా అదృశ్యం కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. దీంతో శనివారం ఫేస్‌బుక్‌లో సూసైడ్‌నోట్ ఆధారంగా కుటుంబ సభ్యులు అత్త భ్రమరాంభ, టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ హనుమంతు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement