గుప్త నిధుల కోసం సమాధిని తవ్వారు | The grave dug for hidden funds in kurnool district | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం సమాధిని తవ్వారు

Dec 9 2015 10:09 AM | Updated on Sep 3 2017 1:44 PM

కర్నూలు జిల్లాలో వింత పరిస్థితి నెలకొంది.

మహానంది: కర్నూలు జిల్లాలో వింత పరిస్థితి నెలకొంది. 44 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి సమాధిలో గుప్త నిధులు ఉంటాయనే అనుమానంతో దుండగులు సమాధిని తవ్వారు.

ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామశివారులోని బుచ్చమ్మతోట వద్ద ఉన్న చిన్నప్పగౌడ్ సమాధిలో విలువైన వస్తువులు ఉంటాయనే అనుమానంతో గుర్తుతెలియని దుండగులు సమాధిని తవ్వారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement