రైతు ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్య

Oct 14 2015 8:32 PM | Updated on Oct 1 2018 2:44 PM

పంట ఎండిపోవడంతో గుండె చెదిరిన రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు.

పంట ఎండిపోవడంతో గుండె చెదిరిన రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..  కృష్ణా జిల్లా అవనిగడ్డ శివారు కొత్తపేటకు చెందిన రైతు అప్పికట్ల నరసింహారావు (44)కు మాచవరం సమీపంలో ఒకటిన్నర ఎకరాలు భూమి ఉంది. ఈ ఏడాది సాగుకు నీరందక పోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.

నాలుగు రోజులుగా సాగునీటి కోసం ప్రతిరోజూ పొలానికి వెళ్లి.. నీరు అందక నిరశగా ఇంటికి రావడం చేస్తున్నాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ నరసింహారావు బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement