రైలు కింద పడి వ్యక్తి మృతి | The death of a person who falls under the train | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి మృతి

Sep 8 2013 3:22 AM | Updated on Sep 1 2017 10:32 PM

స్థానిక రైల్వేస్టేషన్ ప్రాంగణం సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుని ఆనవాళ్లు తెలుసుకున్నారు.

కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: స్థానిక రైల్వేస్టేషన్ ప్రాంగణం సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుని ఆనవాళ్లు తెలుసుకున్నారు.
 
 అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 45 ఏళ్ల వయసు కలిగి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలుపు సిమెంటు రంగు కలిగిన ఫుల్‌షర్టు, నల్ల ప్యాంటు ధరించినట్లు వారు తెలిపారు. అంగి మీద ఇబ్రహీం టైలర్స్ కర్నూలు-3 అన్న చిరునామా ఉందని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement