గుటూరు జిల్లా అచ్చంపేటలో ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు.
గుటూరు జిల్లా అచ్చంపేటలో దారుణం చోటుచేసుకుంది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని కొందరు దుండగులు కత్తులతో నరికి చంపారు. కిరాతకంగా దాడి చేసి తలా మొండెం వేరు చేశారు. ఈ సంఘటన అచ్చంపేట వేల్పూరు రోడ్డులో బుధవారం వెలుగు చూసింది. నడి రోడ్డుపై తలలేకుండా మొండెం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియ రాలేదు.