యువకుడి దారుణ హత్య | The assassination of young man | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Jun 17 2014 12:28 AM | Updated on Aug 21 2018 5:46 PM

ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి శవమై తేలాడు. నుర్మతి గెడ్డ వద్ద గోనె సంచిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు.

  •     ఈనెల 11న తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు
  •      గోనె సంచిలో మృతదేహం లభ్యం
  • జి.మాడుగుల: ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి శవమై తేలాడు. నుర్మతి గెడ్డ వద్ద గోనె సంచిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నుర్మతి పంచాయతీ మద్దివీధి గ్రామానికి చెందిన గొల్లోరి సుబ్బారావు(30)ను ఈ నెల 11వ తేదీన ఎన్.కొత్తూరు గ్రామానికి ఇద్దరు వ్యక్తులు బయటకు తీసుకెళ్లారు.

    అప్పటి నుంచి అతడి ఆచూకీ కనిపించలేదు. ఆదివారం సాయంత్రం నుర్మతి గెడ్డ వద్ద గోనె సంచిలో సుబ్బారావు మృతదేహాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన కొంతమందితో సుబ్బారావుకు పాత కక్షలున్నాయని, వారే హత్య చేశారని మృతుడు తమ్ముడు గొల్లోరి లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement