పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. | The 30 injured in RTC bus accident | Sakshi
Sakshi News home page

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

Feb 1 2016 10:35 AM | Updated on Aug 30 2018 3:58 PM

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. - Sakshi

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

ద్విచక్రవాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.

ద్విచక్రవాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్రవాహన దారుడు అక్కడికక్కడే మృతిచెందగా.. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కడియాలకుంట సమీపంలో సోమవారం చోటుచేసుకుంది.


పలమనేరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు పుంగనూరు నుంచి తిరుపతికి వెళ్తున్న సమయంలో కడియాలకుంట సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించడానికి ప్రయత్నించి అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బూరెగపల్లికి చెందిన నాగరాజురెడ్డి(30) అక్కడికక్కడే మృతిచెందగా.. బస్సులో ఉన్న 30 మందికి తీవ్ర గాయాల య్యాయి.

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఘటనా స్థలికి సమీపంలోనే పెద్ద బావి, విద్యుత్ తీగలు ఉన్నాయి. చెట్టును ఢీకొని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను పుంగనూరు ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement