రూ.10 కే గ్రీవెన్స్‌ మీల్స్‌ | Ten Rupees Meals | Sakshi
Sakshi News home page

రూ.10 కే గ్రీవెన్స్‌ మీల్స్‌

Aug 28 2018 12:37 PM | Updated on Sep 2 2018 4:56 PM

Ten Rupees Meals - Sakshi

గ్రీవెన్స్‌ మీల్స్‌ పథకాన్ని ప్రారంభిస్తున్న పీఓ

సీతంపేట : ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్‌ చొరవతో ప్రతి సోమవారం గిరిజన దర్బార్‌కు వచ్చే గిరిజనులకు రూ.10కే మధ్యాహ్న భోజనం అందించనున్నారు. సుదూర ప్రాంతాలు, కొండలపై నుంచి గ్రీవెన్స్‌కు రానున్న గిరిజనులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. దీనిలో భాగంగా ఐటీడీఏ పీఓ శివశంకర్‌ గ్రీవెన్స్‌ మీల్స్‌ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం భోజనం ఖరీదు రూ.30 కాగా, ఇందులో ఐటీడీఏ రూ.20 భరిస్తుందని తెలిపారు.

ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఐటీడీఏ పరిధిలో 20 మండలాల నుంచి వచ్చే అర్జీదారులు లబ్ధిపొందేందుకు భోజనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రారంభం రోజున సుమారు 300ల మందికి భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి ఎల్‌.ఆనందరావు, డిప్యూటీ ఈఓ రామ్మోహన్‌రావు, ఈఈ అశోక్, డీఈ సింహాచలం, ఐడబ్ల్యూఎంపీ ఏపీడీ డోల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement