తెలుగుగంగలో దంపతుల గల్లంతు | Telugu ganga couple displaced | Sakshi
Sakshi News home page

తెలుగుగంగలో దంపతుల గల్లంతు

Sep 11 2013 3:34 AM | Updated on Aug 21 2018 7:53 PM

దుస్తులు ఉతుకునేందుకు వెళ్లిన దంపతులు ప్రమాదవశాత్తు తెలుగుగంగ కాల్వలో గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన బసవాపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. శిరివెళ్లకు చెందిన ఖాజాహుసేన్(35) బసవాపురం గ్రామానికి చెందిన మాబున్నీ(29)తో వివాహమైంది.

 మహానంది, న్యూస్‌లైన్:  దుస్తులు ఉతుకునేందుకు వెళ్లిన దంపతులు ప్రమాదవశాత్తు తెలుగుగంగ కాల్వలో గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన బసవాపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. శిరివెళ్లకు చెందిన ఖాజాహుసేన్(35) బసవాపురం గ్రామానికి చెందిన మాబున్నీ(29)తో వివాహమైంది. వీరికి ఇజాస్, హుసేన్ బాషా ఇద్దరు కుమారులు. అలాగే సమీప బంధువు కుమార్తె సమ్రీనాను పెంచుకుంటున్నారు. గౌండా పని చేసే ఖాజా భార్య గ్రామానికి చేరుకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం దుస్తులు ఉతుక్కునేందుకు సమీపంలోని తెలుగు గంగ కాల్వ వెళ్లి తిరిగి రాలేదు.
 
 సాయంత్రం కాల్వ గట్టుపై దుస్తులు ఉండటం, అక్కడ ఎవరూ లేకపోవడంతో అటుగా ఇంటికి వస్తున్న కూలీలు అనుమానం పడ్డారు. గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాల్వకు వెళ్లిన తమ తల్లిదండ్రులు రాలేదని ఖాజా హుసేన్ కుమారులు చెప్పడంతో గ్రామస్తులు కాల్వ వెంట గాలించారు. నీటి ఉద్ధృతి అధికంగా ఉండటంతో కొట్టుకుని పోయి ఉంటారని చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రాత్రి వరకు గాలించినా ఆచూకీ కనిపించలేదని సాగునీటి సంఘం అధ్యక్షుడు రామేశ్వరుడు, పీఎన్‌ఎస్ రాయుడు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement