పవన్ను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం: మురళీమోహన్ | telugu desam party welcomes pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్ను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం: మురళీమోహన్

Mar 15 2014 1:22 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం: మురళీమోహన్ - Sakshi

పవన్ను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం: మురళీమోహన్

పవన్ కల్యాణ్ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు, సినీనటుడు మురళీ మోహన్ చెప్పారు.

పవన్ కల్యాణ్ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు, సినీనటుడు మురళీ మోహన్ చెప్పారు. పదవుల కోసం కాకుండా, దేశానికి సేవ చేయాలనే మంచి భావం ఉన్న వ్యక్తి పవన్ అని ఆయన అన్నారు. అందుకే అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి రావాలని తెలిపారు. కిరణ్ పార్టీ దింపుడు కల్లం లాంటిదని, కాంగ్రెస్ వెంటిలేటర్ మీద ఉందని మురళీమోహన్ వ్యాఖ్యానించారు.

శుక్రవారం నాడు చేసిన ప్రసంగంలో పవన్ కూడా చంద్రబాబు గురించి గానీ, తెలుగుదేశం పార్టీ గురించి గానీ ఎలాంటి విమర్శలు చేయకపోవడంతో ఇప్పుడు పవన్ గ్లామర్ను ఉపయోగించుకోడానికి టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే సినీ పరిశ్రమకు చెందిన మురళీమోహన్తో మాట్లాడించినట్లు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement