ముఖ్యమంత్రి పదవి బీసీలకివ్వాలి | Telengana BC the first Chief Minister of the state president | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి పదవి బీసీలకివ్వాలి

Aug 26 2013 4:14 AM | Updated on Sep 1 2017 10:07 PM

ప్రత్యేక తెలంగాణం ఏర్పాటయ్యాక మొదటి ముఖ్యమంత్రిగా బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు.

ఇప్పర్తి (మునుగోడు), న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణం ఏర్పాటయ్యాక మొదటి ముఖ్యమంత్రిగా బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఆదివారం మండలంలోని ఇప్పర్తిగ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం చేపట్టిన తొలి, మలి దశ ఉద్యమాల్లో బీసీలు కీలక పాత్ర పోషించారన్నారు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంత్‌చారి, కానిస్టేబుల్ కృష్ణయ్యలు బీసీలే అన్నారు. రాష్ట్రంలో 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, 
 
 బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని, సబ్‌ప్లాన్ ఎర్పాటుచేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అనేక ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టేలా దేశంలోని 118 మంది బీసీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. కిషోర్, ఓయూ జేఏసీ నాయకుడు తిరుమణి కొండల్,  బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూకంటి ప్రభాకర్, జిల్లా నాయకుడు జనగాం నర్సింహ్మగౌడ్, బూడిదలింగయ్యయాదవ్, జాజుల వెంకటేష్, జాజుల బాస్కర్‌గౌడ్, బడేసాయబ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement