జేఏసీగా బీసీ సంఘాలు | Telangana BC JAC Postpones Statewide Bandh to October 18 | Sakshi
Sakshi News home page

జేఏసీగా బీసీ సంఘాలు

Oct 12 2025 4:48 PM | Updated on Oct 12 2025 5:22 PM

BC Groups Call Off Telangana Protest Temporarily

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ జేఏసీ సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపు తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ మేరకు అక్టోబర్‌ 18న బంద్‌ చేపట్టనున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేశాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వాస్తవానికి అక్టోబర్‌ 14న బీసీ సంఘాలు బంద్‌ చేపట్టాల్సి ఉంది.  అయితే ఈ క్రమంలో బీసీ సంఘాలు ఆదివారం (అక్టోబర్‌ 12) సమావేశమయ్యాయి. ఈ భేటీలో బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ నెల 18న చేపట్టాలని నిర్ణయించాయి. 

ఈ సమావేశంలో బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. ఛైర్మన్‌గా ఆర్ కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‌గా వీజీఆర్‌ నారగొని,వర్కింగ్ ఛైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్‌గా దాసు సురేష్ , రాజారామ్ యాదవ్‌లు ఎన్నికయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement