breaking news
bundh postponed
-
జేఏసీగా బీసీ సంఘాలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బీసీ జేఏసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ మేరకు అక్టోబర్ 18న బంద్ చేపట్టనున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేశాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వాస్తవానికి అక్టోబర్ 14న బీసీ సంఘాలు బంద్ చేపట్టాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో బీసీ సంఘాలు ఆదివారం (అక్టోబర్ 12) సమావేశమయ్యాయి. ఈ భేటీలో బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ నెల 18న చేపట్టాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. ఛైర్మన్‌గా ఆర్ కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‌గా వీజీఆర్ నారగొని,వర్కింగ్ ఛైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్‌గా దాసు సురేష్ , రాజారామ్ యాదవ్‌లు ఎన్నికయ్యారు. -
వరలక్ష్మి వ్రతం.. 29కి బంద్ వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన బంద్‌ను ఒకరోజు వాయిదా వేశారు. వాస్తవానికి ఈనెల 28వ తేదీన బంద్ నిర్వహించాలని పిలుపునివ్వగా, అదే రోజు వరలక్ష్మి వ్రతం ఉంది. శ్రావణమాసంలో మహిళలు చాలా పవిత్రంగా భావించే ఈరోజున బంద్ పాటించడం భావ్యం కాదని, తర్వాతి రోజైన 29వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. కాగా, వైఎస్ఆర్సీపీ ధర్నాతో స్పెషల్ ప్యాకేజిలంటూ టీడీపీ నేతలు కొత్త నాటకాన్ని తెరమీదకు తెచ్చారని బొత్స మండిపడ్డారు. ఈ ప్యాకేజీలు టీడీపీ నేతలు పంచుకోడానికే ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ వ్యాపారం చేస్తున్నారని, అందుకే.. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద ఆయన ఒత్తిడి తేవట్లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్సీపీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటుందన్నారు.