పవన్‌ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి: కవిత | telangana jagruthi kavitha slams pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి: కవిత

Mar 13 2014 12:52 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్‌ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి: కవిత - Sakshi

పవన్‌ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి: కవిత

పవన్‌ కళ్యాణ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు.

హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో సామాజిక తెలంగాణ అని తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సామాజిక  తెలంగాణ అని తర్వాత జై సమైక్యాంధ్ర అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏముఖం పెట్టుకుని తమ్ముడు వస్తున్నాడని ప్రశ్నించారు.

పీఆర్పీ తప్పిదాలకు ముందుగా క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ ప్రజాజీవితంలోకి రావాలన్నారు. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement