ఘనంగా తీజ్ ఉత్సవ్ మేళా | Tees Utsav Mela | Sakshi
Sakshi News home page

ఘనంగా తీజ్ ఉత్సవ్ మేళా

Aug 11 2013 7:53 PM | Updated on Apr 7 2019 4:37 PM

తీజ్ ఉత్సవ్ మేళా ఉరేగింపు - Sakshi

తీజ్ ఉత్సవ్ మేళా ఉరేగింపు

లంబాడిల తీజ్ ఉత్సవ్ మేళా ఉరేగింపు ఆదివార ఘనంగా జరిగింది.

హైదరాబాద్: లంబాడిల తీజ్ ఉత్సవ్ మేళా ఉరేగింపు ఆదివార ఘనంగా జరిగింది. హబ్సిగూడ గాంధీ గిరిజన బస్తీ నుంచి వెలుగుట్ట వరకు జరిగిన ఉరేగింపులో యువతీయువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తోమ్మిది రోజులపాటు నిష్టంగా పెంచిన గోధుమ నారు బుట్టలను ఉరేగింపుగా బీబీనగర్ చెరువులో నిమజ్జననానికి తీసుకువెళ్లారు. సాంప్రదాయబద్దంగా జరుపుకునే ఈ ఉత్సవంలో   లంబాడీలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

యువతీయువకుల నృత్యాలు అందరినీ ఆకట్టున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సింగిరెడ్డి ధన్‌పాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, టిడిపి నాయకుడు బోబ్బల రమణారెడ్డి హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement