చంద్రబాబు పీఏ చెప్పినా... | TDP supporters fighting in GD Nellore | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పీఏ చెప్పినా...

Apr 17 2015 3:45 PM | Updated on Aug 10 2018 6:49 PM

చంద్రబాబు పీఏ చెప్పినా... - Sakshi

చంద్రబాబు పీఏ చెప్పినా...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో పచ్చ తమ్ముళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో పచ్చ తమ్ముళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.  జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం నువ్వంటే నువ్వంటూ తెలుగు తమ్ముళ్లలోని రెండు వర్గాలు ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకుని ఘర్షణకు దిగారు. దీంతో సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

సాక్షాత్తూ చంద్రబాబు పీఏ మనోహర్ జోక్యం చేసుకుని సర్ధి చెప్పినా ఆయన మాటను రెండు వర్గాలు పెడ చెవిన పెట్టాయి. దీంతో కుప్పం పట్టణ టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక గత రెండు రోజులుగా పరిష్కారం కావడం లేదు. ముచ్చటగా మూడో రోజు శుక్రవారం కూడా తమ్ముళ్ల ఘర్షణతో అధ్యక్షుడి ఎన్నిక జరగలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement