గడికోట టీడీపీ ఎంపీటీసీ వైఎస్‌ఆర్‌సీపీలో చేరిక | TDP MPTC joined in YSR Congress Party | Sakshi
Sakshi News home page

గడికోట టీడీపీ ఎంపీటీసీ వైఎస్‌ఆర్‌సీపీలో చేరిక

Mar 4 2017 9:25 AM | Updated on May 25 2018 9:20 PM

గడికోటకు చెందిన తెలుగదేశం ఎంపీటీసీ సీ.మోహన్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కడప కార్పొరేషన్‌: జిల్లాలోని వీరబల్లి మండలం గడికోటకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సీ. మోహన్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం ఇక్కడి ఓ ప్రైవేటు అతిథిగృహంలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సమక్షంలో ఆయన వైఎస్‌ఆర్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక తాను వైఎస్‌ఆర్‌సీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో ఎవరి బలవంతమూ లేదన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తమ్ముడు వైఎస్‌ వివేకానందరెడ్డిపై ఉన్న అభిమానంతోనే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాయచోటి మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి, రామాపురం మాజీ జెడ్పీటీసీ నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement