అసెంబ్లీలో టీడీపీ ఎంపీ కలకలం | TDP MP CM Ramesh goes into Assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో టీడీపీ ఎంపీ కలకలం

Jan 29 2014 7:56 PM | Updated on Aug 10 2018 8:01 PM

అసెంబ్లీలో రాష్ట్ర విభజనపై బిల్లు వ్యవహారం హోరెత్తిస్తుండగా, మరోవైపు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సభలో కలకలం సృష్టించారు.

హైదరాబాద్: అసెంబ్లీలో రాష్ట్ర విభజనపై బిల్లు వ్యవహారం హోరెత్తిస్తుండగా, మరోవైపు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సభలో కలకలం సృష్టించారు. బుధవారం ఆయన అసెంబ్లీలోకి వెళ్లి ఎమ్మెల్యేల మధ్య దర్జాగా కూర్చున్నారు. ఈ విషయం బయటకురావడంతో మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సంగతి తెలుసుకున్న రమేష్ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడకుండా మెల్లగా జారుకున్నారు.

శాసనసభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. సీఎం రమేష్ సభలోకి వచ్చి కూర్చొన్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎమ్మెల్యేకాని వారెవరూ సభలోకి వెళ్లడం సరికాదని శైలజానాథ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement