వైఎస్సార్ సీపీలోకి టీడీపీ నేతలు | Tdp leaders in ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలోకి టీడీపీ నేతలు

Jun 1 2015 4:42 AM | Updated on Aug 10 2018 9:42 PM

వైఎస్సార్ సీపీలోకి టీడీపీ నేతలు - Sakshi

వైఎస్సార్ సీపీలోకి టీడీపీ నేతలు

మండలంలోని కంభంవారిపల్లె పంచాయతీ బలిజపల్లెకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి...

 సదుం : మండలంలోని కంభంవారిపల్లె పంచాయతీ బలిజపల్లెకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. దాదాపు 15 కుటుంబాలకు చెందిన 50 మంది పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

చేరిన వారిలో వెంకటరమణ, శ్రీనివాసులు, ఆదినారాయణ, రెడ్డెప్ప, రామాంజులు, రామ్మూర్తి, ఖాదర్‌బాష, రఫీ, మణికంఠ, గురవయ్య తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడేవారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. పార్టీ కార్యకర్తలకు ఏకష్టం వచ్చిన తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చంద్రబాబు పాలనపై విసుగెత్తి పలువురు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతకుముందు గ్రామంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.

ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షులు పెద్దిరెడ్డి, కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు గౌరీరెడ్డి, ప్రవీణ్‌కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు రమేష్‌రెడ్డి, యువజన విభాగం, రైతు విభాగం అధ్యక్షులు రెడ్డెప్పరెడ్డి, వెంకటస్వామి, విద్యార్థి విభాగం నాయకుడు బావాజీ, ఖాజాపీర్, ధనుంజయరెడ్డి, శివారెడ్డి, ఎల్లప్ప, వెంకటరెడ్డి, మల్లికార్జుననాయుడు, మాజీ వైస్ ఎంపీపీ తిమ్మారెడ్డి, పాపిరెడ్డి, ఎంపీటీసీ ఉషారాణి, సర్పంచ్ వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement