టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది.
విశాఖపట్టణం: టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యకర్తలను లోపలికి అనుమతించకపోవడంపై మంత్రి కాల్వ శ్రీనివాసులతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మంత్రి కాల్వ తన కార్యకర్తలపై వివక్ష చూపుతున్నారని వాసుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. వాసుపల్లిని బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం చినరాజప్ప రంగంలోకి దిగారు.