
రౌడీయిజాన్ని పోషిస్తోంది టీడీపీ నాయకులే
నగరంలో రౌడీయిజాన్ని పెంచి పో షిస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకులేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరపాలకసంస్థ అధికార ప్రతినిధి జె.ఎం.శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
శ్రీకాకుళం అర్బన్: నగరంలో రౌడీయిజాన్ని పెంచి పో షిస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకులేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరపాలకసంస్థ అధికార ప్రతినిధి జె. ఎం.శ్రీనివాస్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలో రౌడీయిజాన్ని అంతం చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నోసార్లు ప్రకట నలు చేశారని, ఆచరణ మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నాయకులే ఇలాంటి నేరాలకు పాల్ప డుతున్నారని, అందుకే వారు చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆరోపించారు.
రెండేళ్లుగా నగరంలోని హోటళ్లు, వ్యాపారులు, ప్రజలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల హయాతినగరంలో రౌడీమూకలు దాడి చేసి ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, ఓ సాయంత్రం దినపత్రికపై టీడీపీ మనుషులు దౌర్జన్యం చేశారని తెలిపారు. ఇటీవల పాత 14వ వార్డు గాజులవీధిలో ఉన్న అంగన్‌వాడీ కార్యాలయంపై దాడి చేసిన వారు టీడీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. అలాగే రెండు రోజుల కిం దట ఓ హోటల్‌పై దాడి జరిగిందన్నారు. ఈ రౌడీమూకలకు స్థానిక ఎమ్మెల్యే కొమ్ముకాయడం శోచనీయమన్నారు.
నగరంలో రౌడీయిజాన్ని అణచివేయడం చేతకాకపోతే తప్పుకోవాలన్నారు. అఖిలపక్షం నాయకులతో కమిటీ వేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా నగర పాలక సంస్థకు ఎన్నికలు కూడా నిర్వహించలేని దుస్థితిలో ఆ పార్టీ ఉందని అన్నారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, పార్టీ యువజన విభాగం నరగసంస్థ అధ్యక్షుడు కోరాడ రమేష్, పార్టీ నేతలు కర్నేని హరి, అలపాన అప్పోజీరెడ్డి, కె.రంగాజీదేవ్ తదితరులు ఉన్నారు.