మండలంలోని రణస్థలం జంక్షన్ జాతీయ రహదారి పక్కన దివంగత టీడీపీ నేత కింజరాపు ఎర్రన్నాయుడు మృతి చెందిన చోటే ఆయన విగ్రహాన్ని
రణస్థలం : మండలంలోని రణస్థలం జంక్షన్ జాతీయ రహదారి పక్కన దివంగత టీడీపీ నేత కింజరాపు ఎర్రన్నాయుడు మృతి చెందిన చోటే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక టీడీపీ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు, ఆయన సోదరులు సహదేవుడు, సూర్యనారాయణ సహకారంతో నెలకొల్పిన ఈ విగ్రహాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు బుధవారం ఆవిష్కరించారు. ఎర్రంనాయుడు ప్రమాదానికి గురైనప్పుడు ఆయనకు నీళ్లందించి సేవలు చేసిన గాజుల లక్ష్మీదంపతులను సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, పార్టీ నాయకులు చౌదరి నారాయణమూర్తి, గొర్లె హరిబాబునాయుడు, సంత్యేంద్రవర్మ తదితరులు పాల్గొన్నారు.