అక్రమ మైనింగ్‌.. ప్రభుత్వ స్థలం కబ్జా

TDP Leader Illegal Mining In Government Land - Sakshi

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీకి చెందిన మైనింగ్‌ మాఫియా బరి తెగించింది. అనుమతులు ఉండవు.. నిబంధనలు పాటించరు.. చేసే దంతా దందానే.. అడ్డు చెప్పే వారి మీద దాడులు.. ఇది చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పచ్చ నేతల బరితెగింపు.. అక్రమంగా మైనింగ్ నిర్వహించడమే కాకుండా పేదలకు మంజూరు చేసిన ఇండ్ల  స్థలాలను సైతం దర్జాగా ఆక్రమించి, అడ్డు వస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అండతో రెచ్చిపోయిన పచ్చ నేతలు ఇప్పుడు కూడా బరి తెగింపుకు పాల్పడుతున్నారు. శాంతిపురం మండలంలో  టీడీపీకి చెందిన నేత మైనింగ్ మాఫియా అవతారం ఎత్తారు. ముళ్ళూరు కృష్ణాపురంలో టీడీపీకి చెందిన జయరామి రెడ్డి చాలా సంవత్సరాలు గా మైనింగ్ నిర్వహిస్తున్నారు.  తనకు గ్రామంలోని సర్వే నెంబర్ 11/4 లో 3.54 ఎకరాల్లో మైనింగ్ కు అనుమతి ఉందని చెప్పు కొంటాడు.. అది కూడా అనుమానమే. అయితే ఆస్థలం ప్రభుత్వ ఆసుపత్రి కి కేటాయించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో నిర్ణయించారు.. అయిన ఇప్పటికి టీడీపీ నేత ఆస్థలంలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు.

గత టీడీపీ పాలనలో ఏకంగా పది ఎకరాలు ఆక్రమించి మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ స్థలంలో తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని స్థానిక పేదలు.. అధికారులను కోరారు.. దీంతో 28 మందికి అధికారులు ఇంటి స్థలాలు కేటాయించారు.. చదును కార్యక్రమాలు కూడా చేస్తుండగా టీడీపీ నేత జయరామి రెడ్డి తన అనుచరులతో కలిసి అడ్డుకోవడంతో స్థానికులు ధర్నాకు దిగారు.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ముళ్ళూరు కృష్ణాపురంలో పేదలకు ఇంటి స్థలాలు  కేటాయించారని, కానీ కొందరు అడ్డుకొంటున్నారని శాంతిపురం ఎమ్మారో విజయలక్ష్మి అన్నారు.

టీడీపీ నేత జయరామి రెడ్డి అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలో గతంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. అయిన పట్టించు కోలేదు.. ఇప్పుడు స్థానికులనే బెదిరిస్తూ దాడులకు ఉసి గొల్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇతడికి చంద్రబాబు కు ప్రధాన అనుచరుడు ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు అండదండలు ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top