కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులను టీడీపీలో చేర్చుకునే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
హైదరాబాద్: కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులను టీడీపీలో చేర్చుకునే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వీరిద్దరినీ పార్టీలో చేర్చుకునే విషయంలో ఇద్దరు మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు.
కొణతాల అనుచరుడు గండి బాబ్జి చేరికకు గంటా వర్గం ససేమిరా అంటోంది. గండి బాబ్జితో కార్యకర్తలకు చాలా సమస్యలున్నాయని అంటున్నారు. దాడి వీరభద్రరావు చేరికను అయ్యన్నపాత్రుడు వర్గం వ్యతిరేకిస్తోంది.