రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నా... | tdp cadre demolish ys rajashekarareddy statue | Sakshi
Sakshi News home page

రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నా...

Jul 29 2016 8:17 AM | Updated on Aug 10 2018 8:16 PM

రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నా... - Sakshi

రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నా...

రోజు రోజుకు అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

రాప్తాడు(అనంతపురం): రోజు రోజుకు అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధికారం అండ చూసుకొని తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం బధ్రాపూరం గ్రామంలో గురువారం అర్ధరాత్రి మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ఇది గుర్తించిన స్థానికులు ఐదుగురు నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో.. పోలీసులు వారిని నామమాత్రంగా విచారణ చేపట్టి వదిలేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తుల, గ్రామస్థులు పోలీసులు వైఖరిని తప్పుపడుతున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement