నూజివీడులో ‘టీడీపీ’ హైడ్రామా

TDP activists high Drama In Krishna district - Sakshi

నూజివీడు:  పట్టణంలో పురపాలక సంఘం చేపట్టిన పలు సిమెంట్‌ రోడ్ల ప్రారంభోత్సవాలను ఎమ్మెల్యే ప్రతాప్‌ శనివారం నిర్వహిస్తుండగా, అడ్డుకునేందుకు కొందరు టీడీపీ కార్యకర్తలు హైడ్రామా నడిపించారు.  వివరాల్లోకి వెళితే..  పట్టణంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను శని వారం పురపాలక సంఘం  ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావ్‌  నెహ్రూపేటలోని సిమెంట్‌ రోడ్డును ప్రారంభించేందుకు వెళ్లారు. ఎమ్మెల్యే అక్కడకు చేరుకున్న సమయంలో అదే ప్రాంతంలో ఉన్న టీడీపీ పట్టణ కార్యదర్శి మోచర్ల కృష్ణంరాజు, అతని అనుచరులు  ఎమ్మెల్యేపై నినాదాలు చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే అక్కడ ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం సిమెంట్‌ రోడ్డు ప్రారంభించేందుకు రాగా టీడీపీ కార్యకర్తలు శిలాఫలకానికి  అడ్డుగా నిల్చుని నినాదాలు చేశారు. ఒకదశలోతోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. 

ఎమ్మెల్యే సంయమనం..
తనపై నినాదాలు చేస్తున్నా దాదాపు 300మందికి పైగా  కార్యకర్తలు వెంట ఉన్నా ఎమ్మెల్యే ప్రతాప్‌ చా లాసేపు సంయమనం పాటించారు. కార్యకర్తలు, నా యకులను కూడా శాంతంగాఉండమని సూచించారు. మునిసిపాలిటీ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయలే దని టీడీపీ కార్యకర్తలు కేకలు వేయడంతో అప్పటి కప్పుడు డీఈ సత్యన్నారాయణను  పిలిపించి వివరా లు వెల్లడించమన్నారు. చైర్‌పర్సన్, కమిషనర్ల ఆదేశం మేరకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీఈ చెప్ప డంతో పోలీసులు కార్యకర్తలను పంపించి వేశారు. కాగా, ఎమ్మెల్యే వెళ్లాక సీఐ రామ్‌కుమార్‌.. టీడీపీ పట్టణ కార్యదర్శి కృష్ణంరాజు, అతని అనుచరుల వద్దకు వెళ్లి ప్రారంభోత్సవాలను అడ్డుకోలేకపోయారంటూ ఎద్దేవా చేయడం వివాదాస్పదంగా మారింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top