మహిళా వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి | TDP Activist Attack on Grama Volunteer in SPSR Nellore | Sakshi
Sakshi News home page

మహిళా వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి

Apr 24 2020 1:37 PM | Updated on Apr 24 2020 1:37 PM

TDP Activist Attack on Grama Volunteer in SPSR Nellore - Sakshi

గాయాలు చూపుతున్న వలంటీర్‌ శ్రావణి

నెల్లూరు, వాకాడు: మండలంలోని శ్రీపురానికి చెందిన వలంటీర్‌ సీహెచ్‌ శ్రావణిపై బుధవారం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆమె విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దాడి చేసి గాయపరిచారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కల్లు విక్రయాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే శ్రీపురంలో టీడీపీకి చెందిన కొందరు కల్లు విక్రయాలు జరుపుతుండడంతో ఇతర ప్రాంతాల వారు పెద్ద ఎత్తున కల్లు కోసం వస్తున్నారన్నారు. దీంతో విక్రయదారులను అడ్డుకునే ప్రయత్నంలో తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా ‘ మాపైనే ఫిర్యాదు చేస్తావా?’ అంటూ బూతులు తిడుతూ మూకుమ్మడిగా తనపై దాడి చేయడమే కాకుండా అడ్డొచ్చిన తన భర్త, సోదరుడిపై కూడా దాడి చేసి గాయపరిచారన్నారు. ఈ విషయమై ఎంపీడీఓ గోపీనాథ్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement