చెట్టును ఢీకొన్న టాటాఎస్.. వ్యక్తి మృతి | tata ace rolls and one dies | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న టాటాఎస్.. వ్యక్తి మృతి

Jun 29 2015 8:16 AM | Updated on Sep 3 2017 4:35 AM

వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

అనంతపురం: వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం తడకలపల్లి గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. కర్ణాటకలోని మధుగిరి తాలుక బేర్పూర్‌ గ్రామానికి చెందిన రాజన్న(42) టాటా ఎస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని హిదూపురం నుంచి బేర్పూర్‌కు పశువుల లోడ్‌తో బయలుదేరాడు.

వాహనం తడకలపల్లి సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న రాజన్న అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని బెంగళూరు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement