తమిళులను కాపాడిన మత్స్యకారులు | Tamils ​​rescued fisherman | Sakshi
Sakshi News home page

తమిళులను కాపాడిన మత్స్యకారులు

May 30 2015 7:10 AM | Updated on Sep 3 2017 2:57 AM

సముద్రంలో చేపల వేటకు వచ్చి ప్రమాదానికి గురైన తమిళ జాలరులను మచిలీపట్నం మత్స్యకారులు కాపాడారు.

మచిలీపట్నం (కృష్ణా): సముద్రంలో చేపల వేటకు వచ్చి ప్రమాదానికి గురైన తమిళ జాలరులను మచిలీపట్నం మత్స్యకారులు కాపాడారు. వివరాలు.. సముద్రంలో వేటకు వచ్చిన ఐదుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులతో కూడిన పడవ శనివారం వేకువజామున బోల్తా పడింది. దీంతో అక్కడికి సమీపంలోనే ఉన్న బందరుకు చెందిన మత్స్యకారులు గమనించి, అప్రమత్తమయ్యారు. నీటిలో పడిపోయిన నలుగురిని రక్షించి తమ బోటులో చేర్చారు. కాగా, మరొకరు నీటిలో గల్లంతయ్యారు. రక్షించిన వారిని మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement