బాబుపై స్వరూపానందేంద్ర ఫైర్‌ | Swaroopanandendra Saraswati Fires on Chandra Babu | Sakshi
Sakshi News home page

బాబుపై స్వరూపానందేంద్ర ఫైర్‌

Apr 20 2018 6:27 PM | Updated on Jul 28 2018 6:35 PM

Swaroopanandendra Saraswati Fires on Chandra Babu - Sakshi

సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మండిపడ్డారు. చంద్రబాబు పరిస్థితి అన్నీ ఉన్నా ఐదోతనం లేనట్టుగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఆదిశంకరాచార్యుల విగ్రహం పెట్టాలని అడిగితే చంద్రబాబు స్పందించలేదన్నారు. ఆయన విగ్రహాలున్న తిరుమల, శ్రీశైలం, బదరీ, కేదార్‌నాథ్‌ వంటివన్నీ చాలా అభివృద్ధి చెందాయని చెప్పారు. బాబు దీనిపై స్పందించకపోయినా.. రాష్ట్ర అభివృద్ధి కోసం శంకరాచార్యుల విగ్రహాన్ని రాజధానిలో మేమే ప్రతిష్టిస్తామన్నారు. 

ఏపీ ప్రజలను మభ్యపెట్టి దోచుకునే అలవాటున్న ప్రభుత్వ పెద్దలు నా ప్రతిపాదనలను పట్టించుకోలేదని చెప్పారు. బుద్ధుడు వైరాగ్యం, శూన్య వాదం, నిస్సారమైన ధర్మాన్ని ప్రచారం చేశారు.. అలాంటి బుద్ధుని పేరు పెడితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ప్రతి మహిళ అమ్మవారిలా ఉండాలని కోరుకున్నది శంకరాచార్యులే అని, అందుకే ఆయన విగ్రహాన్ని రాజధానిలో ప్రతిష్టించాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement