భానుడి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
హైదరాబాద్ : భానుడి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా.. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఎస్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయారు. ఈ విషయం గమనించిన సచివాలయ సిబ్బంది వెంటనే వారిని సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.