పార్వతీపురంలో సూదిగాడి కలకలం | sudigaadu hulchul at parvathipuram | Sakshi
Sakshi News home page

పార్వతీపురంలో సూదిగాడి కలకలం

Jan 13 2016 5:30 PM | Updated on Sep 3 2017 3:37 PM

పార్వతీపురంలో సూదిగాడి కలకలం

పార్వతీపురంలో సూదిగాడి కలకలం

విజయనగరం జిల్లాలో సూదిగాడు కలకలం సృష్టించాడు.

పార్వతీపురం: విజయనగరం జిల్లాలో సూదిగాడు కలకలం సృష్టించాడు. పార్వతీపురంలో బుధవారం గుర్తు తెలియని దుండగుడు ఓ బాలికను సూదితో గుచ్చి పారిపోయాడు.

పట్టణంలోని జగన్నాథపురం ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు కుమార్తె మౌనిక(9) రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మోచేతిపై సూదితో గుచ్చి పరారయ్యాడు. బాధితురాలు నొప్పితో బాధపడుతుండగా గమనించిన స్థానికులు విషయం తెలుసుకుని చుట్టుపక్కల గాలించినా దుండగుడి ఆచూకీ తెలియలేదు. తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఎలాంటి అపాయం లేదని వైద్యులు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement