ఎంసెట్‌ దరఖాస్తులో ‘ఈడబ్ల్యూఎస్‌’ నంబర్‌ ఆప్షనల్‌ మాత్రమే

Sudheer Reddy Comments With Sakshi

కౌన్సెలింగ్‌ సమయంలో సర్టిఫికెట్‌ను సమర్పించాలి

సాక్షితో సెట్స్‌ ప్రత్యేకాధికారి ఎం.సుధీర్‌రెడ్డి   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్‌–2020 ఆన్‌లైన్‌ దరఖాస్తులో ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) కేటగిరీ అభ్యర్థులు ధ్రువపత్రం నంబర్‌ను నమోదు చేయడం తప్పనిసరి కాదని సెట్స్‌ ప్రత్యేకాధికారి ఎం.సుధీర్‌రెడ్డి సాక్షితో తెలిపారు.
- అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకొని ఉంటే ఆన్‌లైన్‌ దరఖాస్తులో ‘ఎస్‌’ అని టిక్‌ చేసి నంబర్‌ను నమోదు చేయవచ్చు.
- సర్టిఫికెట్లు అందుబాటులో లేని అభ్యర్థులు ‘ఎస్‌’ అని టిక్‌ చేస్తే సరిపోతుంది. నంబర్‌ నమోదు కేవలం ఆప్షన్‌ మాత్రమే.
- ఇటువంటి అభ్యర్థులు అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ సమయంలో తమ ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లను పరిశీలనకు చూపించాల్సి ఉంటుంది.
- ఈడబ్ల్యూఎస్‌ కోటాకు చెందిన పలువురు అభ్యర్థుల నుంచి అందిన విన్నపాల మేరకు ఈ మార్పులు చేశాం.
- ఎంసెట్‌కు ఇప్పటి వరకు 1,41,491 దరఖాస్తులు అందాయి. వీటిలో 58 వేల దరఖాస్తులు మెడికల్‌ కాగా తక్కినవి ఇంజనీరింగ్‌ విభాగానికి అందాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top