మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించాలని హిందూపురం లోక్‌సభ, మునిసిపల్, పంచాయతీ ఎన్నికల పరిశీలకులు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించాలని హిందూపురం లోక్‌సభ, మునిసిపల్, పంచాయతీ ఎన్నికల పరిశీలకులు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మునిసిపల్ ఎన్నికలు, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ‘జనపథం’ నేపథ్యంలో జిల్లాలోని సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో ఆయన శుక్రవారం నగరంలోని ఎస్‌ఆర్‌ఐటీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ...ఎన్నికల్లో విజయం సాధించడమే ధ్యేయంగా సూచనలు, సలహాలను అందజేయాలన్నారు.
ప్రజలతో మమేకమై పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. ఈ నెల 16 నుంచి ఐదు రోజులపాటు జరిగే వైఎస్ విజయమ్మ పర్యటనను (మునిసిపల్ ఎన్నికల ప్రచారం) దిగ్విజయం చేయాలన్నారు. కాంగ్రెస్, టీడీపీలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఈ రెండు పార్టీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకుడు అవసరమెంతైనా ఉందని, ఆ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని కొనియాడారు. ఆయన నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యమవుతుందన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ శంక రనారాయణ మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. సమావేశంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సీజీసీ సభ్యుడు గిర్రాజు నగేష్, రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రచార కార్యద ర్శి సోమశేఖర్‌రెడ్డి, డీసీసీబీ అభ్యర్థి లింగాల శివశంకర్‌రెడ్డి, పార్టీ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజనేయులు, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ చుక్కలూరు దిలీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.