ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ | Sub-Registrar captured by the ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

Nov 3 2015 10:58 AM | Updated on Aug 17 2018 12:56 PM

విధుల నుంచి ఇటీవల సస్పెండ్ అయిన అక్కయ్య పాలెం సబ్ రిజిస్ట్రార్ కృష్ణదాస్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది.

మరో అవినీతి చేప ఏసీబీ వల్లో చిక్కింది. విధుల నుంచి ఇటీవల సస్పెండ్ అయిన అక్కయ్య పాలెం సబ్ రిజిస్ట్రార్ కృష్ణదాస్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది.  విశాఖ పట్టణం రవీంద్రనగర్ లో సబ్ రిజిస్ట్రార్ కృష్ణదాస్ ఇంటిలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేసింది.  ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్ ఇంటి తో పాటు.. అతని బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అతడి వద్ద నుంచి సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అక్కయ పాలెం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన కృష్ణదాస్  అవినీతి ఆరపణలతో ఇటీవలే ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement