నేటి నుంచి ఎస్వీయూ డిగ్రీ పరీక్షలు | su degree examinations from today, | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్వీయూ డిగ్రీ పరీక్షలు

Mar 16 2016 2:03 AM | Updated on Sep 26 2018 3:25 PM

ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం

యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25 వరకు జరిగే ఈ పరీక్షలకు ఎస్వీయూ పరీక్షల విభాగం అవసరమైన ఏర్పాట్లుచేసింది. ఎస్వీయూ పరిధిలో 136 డిగ్రీ కళాశాలల విద్యార్థులు పరీక్షలు రాయడానికి వీలుగా అధికారులు 20 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కళాశాలల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 39,583 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ఆమేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ఎం.సురేష్‌బాబు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికీ ఇతర కళాశాలలకు చెందిన అధ్యాపకుడిని పరిశీలకుడిగా నియమించినట్లు చెప్పారు. మూడు బృందాలను ఫ్లయింగ్ స్క్వాడ్‌గా ఏర్పాటు చేశామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement