పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న చిన్నారి ప్రమాదవశాత్తూ ఆటోలో నుంచి కింద పడి మృతిచెందాడు.
మంత్రాలయం (కర్నూలు) : పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న చిన్నారి ప్రమాదవశాత్తూ ఆటోలో నుంచి కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం విద్యానగర్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని సాలహలి గ్రామానికి చెందిన జీవరత్నం(12) విద్యానగర్‌లోని పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు.
కాగా మంగళవారం పాఠశాల అనంతరం ఇంటికి వెళ్లడానికి బస్సు రాకపోవడంతో.. ఆటో ఎక్కాడు. ఆటో విద్యానగర్ చివరకు రాగానే ప్రమాదవశాత్తూ ఆటోలో నుంచి జారిపడ్డాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు విద్యార్థిని వెంటనే ఆదోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో మృతిచెందాడు.