కాలేజీ భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగింది.
తిరుపతి (చిత్తూరు) : కాలేజీ భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని బాలాజీ కాలనీకి చెందిన హిందూసా(18) పద్మావతి విశ్వవిద్యాలయంలో ఒకేషనల్ డిగ్రీ కోర్సు రెండవ ఏడాది చదువుతుంది. కాగా హిందుసా చిన్నప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి భోజనం చేసిన అనంతరం కాలేజీ భవనం పైకి ఎక్కి అమాంతం దూకేసింది. ఇది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.