
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లాకు చెందిన సుష్మిత, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో లా చదువుతుంది. తిరుపతిలోని ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న సుష్మిత గురువారం హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సుష్మిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సుష్మిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.