చరిత్ర సృష్టించిన రష్మీ సామంత్‌

Rashmi Samant Elected As Oxford University Student Leader - Sakshi

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌ యూనియన్‌ అధ్యక్షురాలిగా ఎంపిక

ఈ ఘనత సాధించిన మొదటి భారతీయురాలు

లండన్‌ : భారత్‌కు చెందిన రష్మీ సామంత్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. లినారె కాలేజ్‌లో ఎమ్మెస్సీ చదువుతున్న రష్మీ మొత్తం 3,708 ఓట్లకుగానూ, 1,966 ఓట్లు సాధించారు. 2021–22 సంవత్సరానికి ఆమె విద్యార్థి యూనియన్‌ అధ్యక్షురాలిగా పని చేయనున్నారు. సిలబస్‌ డీకాలనైజేషన్, డీకార్బొనైజింగ్‌ అనే రెండు ప్రధానాంశాలను ఆమె తన మేనిఫెస్టోలో చేర్చి విద్యార్థుల ఆదరణ చూరగొన్నారు. బేమ్‌ (బ్లాక్, ఏసియన్, మైనారిటీ, ఎత్నిక్‌) వర్గానికి చెందిన ఆమె బలహీన వర్గాలకు చెందిన వారి సమస్యలను అర్థం చేసుకున్నట్లుగా విజన్‌ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తానని కూడా తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలిగా దేవికా అనే మరో బారతీయురాలు ఎన్నికయ్యారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top