హవ్వ.. ఇదేం చోద్యం..! | Student attempted sexual assault Allegations Employee | Sakshi
Sakshi News home page

హవ్వ.. ఇదేం చోద్యం..!

Oct 30 2014 1:02 AM | Updated on Nov 9 2018 5:02 PM

ఆమె ఓ ప్రజాప్రతినిధి. మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఆమె..ఓ నర్సింగ్ విద్యార్థినిని కాటేయాలని చూసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కేంద్రాస్పత్రి ఉన్నతాధికారికి

 విజయనగరం ఆరోగ్యం: ఆమె ఓ ప్రజాప్రతినిధి. మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఆమె..ఓ నర్సింగ్ విద్యార్థినిని కాటేయాలని చూసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కేంద్రాస్పత్రి ఉన్నతాధికారికి సిఫారసు చేయడం విడ్డూరం. ఈ విషయం కేంద్రాస్పత్రిలో సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ఏడాది ఆక్టోబర్‌లో శిక్షణ కోసం వచ్చిన నర్సింగ్ విద్యార్థినిపై ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లైంగికదాడికి యత్నించాడు. దీంతో ఆమె నర్సింగ్ సిబ్బంది ద్వారా ఆస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు  సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు.  విధుల నుంచి తప్పించినప్పటికీ ఉద్యోగి మాత్రం తన ప్రయత్నాలు మానలేదు.  అప్పట్లో కాంగ్రెస్ పెద్దలతో ప్రయత్నాలు ప్రారంభించిన  ఆ ఉద్యోగి, ఇప్పుడు టీడీపీ పెద్దలతో ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాజాగా  అధికార పార్టీకి చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి సదరు ఉద్యోగికి రీ పోస్టింగ్ ఇవ్వమని  హుకుం జారీచేసినట్టు తెలుస్తోంది. మహిళా నేత సిఫారసుకు అధికారులు కూడా తలాడించినట్లు సమాచారం. ఆరోపణలు ఉన్న  ఓ వ్యక్తికి మహిళా ప్రజాప్రతినిధి అయి ఉండి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వమనడంపై సర్వత్రా విస్తుపోతున్నారు. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు వద్ద సాక్షి ప్రస్తావంచగా  తనకు ఎటువంటి సిఫారసూ రాలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement