సిటీలో స్పైడర్‌మ్యాన్‌..!

Street charity Organization New Campaign For Street Food - Sakshi

బిగ్‌స్కౌట్‌పేరుతో స్ట్రీట్‌ సంస్థ సేవా కార్యక్రమాల్లో వినూత్న ప్రచారం

విశాఖసిటీ: మీరు చూస్తున్నది నిజమే.. సాహసాల స్పైడర్‌ మ్యాన్‌ విశాఖ వీధుల్లో విహరించాడు. సినిమాల్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే స్పైడర్‌ మ్యాన్‌..నగరంలో నిరాశ్రయుల చెంతకు వచ్చాడు.వారి బాగోగుల గురించి ఆరా తీశాడు.సినిమా క్యారెక్టర్‌లో కనిపించే స్పైడర్‌ మ్యాన్‌.. నిజ జీవితంలోకి ఎలా వచ్చాడా అని ఆలోచిస్తున్నారా.? ఇదంతా.. స్ట్రీట్‌ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారం. బిగ్‌ స్కౌట్‌ పేరుతో ఈ నెల 16 నుంచి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో 100 మందికి పైగా వలంటీర్లు హాజరుకానున్నారు.

నగరాన్ని 6 భాగాలుగా విడదీసి ఈ 100 మంది టీమ్స్‌గా ఏర్పడతారు. గాజువాక నుంచి మధురవాడ వరకూ ఉన్న నిరాశ్రయుల్ని ఈ బృందాలు కలిసి వారి వివరాలు తీసుకుంటుంది. వారికి ఆహారపదార్థాలు, దుస్తుల్ని ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పరిస్థితి బాగులేకపోతే వైద్య పరీక్షలకు తీసుకెళ్లడంతో పాటు మందులు పంపిణీ చేస్తామని స్ట్రీట్‌ ప్రతినిధులు తెలిపారు. అదే విధంగా ఉపాధి కోసం ఎదురు చూసేవారికి వెంటనే ఉపాధి అవకాశాలు కల్పిం చనున్నట్లు స్ట్రీట్‌ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగానే స్పైడర్‌ మ్యాన్‌ నగరంలో సందడి  చేశాడు. ఈ సంస్థలో వలంటీర్‌గా చేరి సేవలందించానుకునేవారు 6305182805 నం బర్‌లో సంప్రదించాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top