ఎన్ని వివాదాలు వచ్చినా పట్టించుకోకుండా రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకే కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, అమరావతి: ఎన్ని వివాదాలు వచ్చినా పట్టించుకోకుండా రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకే కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే దీనిపై అంగీకారానికి వచ్చినా.. అధికారి కంగా దాన్ని త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. రాజధాని వ్యవహారాలపై ఏర్పాటైన ఉపసంఘం సమావేశం మంగళవారం యనమల ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగింది.
సింగపూర్ కన్సార్టియంకు స్టార్టప్ ప్రాజెక్టును అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాగా, ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి ఐదుశాతం వాటానే ఇస్తానని సింగపూర్ కన్సార్టియం పెట్టిన ప్రతిపాదనపై చర్చలు జరపాలని ఉపసంఘం సమావేశానికి హాజరైన సీఆర్‌డీఏ అధికారులకు సూచించింది.