గాంధీ ఆస్పత్రిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు | SPF Men at Gandhi hospital | Sakshi
Sakshi News home page

గాంధీ ఆస్పత్రిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు

May 28 2015 7:33 PM | Updated on Sep 3 2017 2:50 AM

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి కేటాయించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) పోలీసులు గురువారం విధుల్లో చేరారు.

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి కేటాయించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) పోలీసులు గురువారం విధుల్లో చేరారు. కొన్ని సందర్భాల్లో రోగి కుటుంబసభ్యులు, బంధువులు చేసే దాడుల నుంచి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని రక్షించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నగరంలోని గాంధీ, ఉస్మానియా, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆస్పత్రులకు ఎస్పీఎఫ్ దళాలను కేటాయించింది. ఈ మేరకు ఎస్పీఎఫ్ డీఎస్‌పీ సత్యనారాయణ నేతృత్వంలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఆరుగురు కానిస్టేబుళ్లు గురువారం గాంధీ ఆస్పత్రికి చెందిన విధుల్లో చేరారు. ఎనిమిది మంది కానిస్టేబుళ్లతో కూడిన ఎస్పీఎఫ్ దళం ఆస్పత్రి పరిసర ప్రాంతాలతోపాటు ఎమర్జెన్సీ, ఏఎంసీ, మార్చురీ తదితర విభాగాల వద్ద నిరంతరం గస్తీ నిర్వహిస్తారు. ఎస్పీఎఫ్ పోలీసులు ఆస్పత్రిలో ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement