సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు | Special train between Secunderabad to Kakinada | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు

May 31 2015 8:13 AM | Updated on Sep 3 2017 3:01 AM

వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా.. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు మరో ప్రత్యేక రైలును జూన్ 1, 2వ తేదీలలో నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

హైదరాబాద్ : వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా.. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు మరో ప్రత్యేక రైలును జూన్ 1, 2వ తేదీలలో నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.  07201 నెంబర్ గల రైలు కాకినాడలో జూన్ 1వ తేదీ రాత్రి 11 గంటలకు బయలుదేరి గుంటూరు మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి జూన్ 2న (07202) సికింద్రాబాద్‌లో రాత్రి 9.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు కాకినాడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement