సచివాలయాల పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాలయాలు | Special Offices for Supervision of Village and Ward Secretariats | Sakshi
Sakshi News home page

సచివాలయాల పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాలయాలు

Jan 18 2020 4:19 AM | Updated on Jan 18 2020 4:19 AM

Special Offices for Supervision of Village and Ward Secretariats - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ప్రత్యేకంగా కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటికి ప్రత్యేకాధికారులను నియమించాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ విధానంపై విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్‌ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణల ఆధ్వర్యంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ, వాటి పర్యవేక్షణ, విధివిధానాలను కమిషనర్‌ కన్నబాబు వివరించారు. ప్రత్యేక వ్యవస్థగా సచివాలయాలను ముందుకు తీసుకువెళ్లాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఱఅధికార యంత్రాంగానికి బాధ్యతలను అప్పగించడం ద్వారా జవాబుదారీతనాన్ని పెంచుతామని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement