breaking news
Secretaries of the village
-
కార్డు కష్టాలు తీరిన వేళ...
‘విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని ఎస్బీఐ కాలనీకి చెందిన గొర్లె శ్రీదేవి ఈ నెల 10న రైస్ కార్డు కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసింది. వార్డు వలంటీర్, గ్రామ రెవెన్యూ అధికారి దరఖాస్తును పరిశీలించి.. ప్రజాసాధికార సర్వే వివరాలతో సరిచూశారు. అర్హురాలిగా గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అంతే... ఆమె పేరుతో ఈ నెల 18న పౌర సరఫరాలశాఖ కమిషనర్ రైస్ కార్డును మంజూరు చేశారు. ప్రింట్ కాపీని సచివాలయ సిబ్బంది అందజేశారు. వచ్చేనెల నుంచి ఆమెకు రేషన్ సరుకులు అందనున్నాయి’. విజయనగరం గంటస్తంభం: రైస్ కార్డు... పేదవారి బతుకుకు ఆధారపత్రం. అందుకే కార్డు పొందేందుకు ఆరాట పడతారు. చేతికందాక సంతోషపడతారు. గతంలో ఏళ్ల తరబడి తిరిగినా అందని కార్డు... ఇప్పుడు దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే చేతికందుతుండడంతో సంబరపడుతున్నారు. కార్డును పదేపదేసార్లు చూస్తూ మురిసిపోతున్నారు. సచివాలయ వ్యవస్థతో చక్కని పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డిని మనసారా అభినందిస్తున్నారు. ప్రక్రియ అంతా పదిరోజులే.. సచివాలయాలు రావడం, సిబ్బందికి అధికారాలు ఇవ్వడంతో రైస్ కార్డులకు సంబంధించిన పక్రియ సులభతరమైంది. పదిరోజుల్లోనే పరిశీలన పూర్తవుతోంది. కుటుంబ యజమాని దరఖాస్తు చేసుకున్న రోజే వీఆర్వో లాగిన్లోకి వెళ్తుంది. వీఆర్వో ఆ వివరాలు వలంటీర్‌కు ఇస్తే వారు వెంటనే ఈకేవైసీ చేసి తిరిగి వీఆర్వోకు అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఆ డేటా సిక్స్‌స్టెప్ వాల్యూడేషన్కు వెళ్తుంది. ప్రజాసాధికార సర్వే, ఇతర డేటాతో దరఖాస్తుదారుని కుటుంబ డేటాను పరిశీలించి అర్హత ఉంటే రైస్‌కార్డు మంజూరు చేసి డిజిటల్ సంతకం కోసం తహసీల్దార్‌కు వెళ్తుంది. అనంతరం ఆ డేటా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు చేరుతుంది. ఆయన రేషన్‌కార్డు పీడీఎఫ్ ఫైల్లో డీఎస్వోకు పంపిస్తారు. వెంటనే డీఎస్వో కార్డు ముద్రించి సీఎస్‌డీటీ, వీఆర్వో ద్వారా సచివాలయానికి పంపిస్తే వలంటీరు నేరుగా లబ్ధిదారుకు అందజేస్తారు. ఈ పక్రియ మొత్తం పదిరోజుల్లో పూర్తి అవుతుండడం.. ఎవరినీ ప్రాథేయపడకుండా చేతికి నేరుగా కార్డు అందుతుండడంతో లబి్ధదారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇప్పటికే వేలాది కార్డులు మంజూరు జిల్లాలో జూన్ నెల ఆరంభం నుంచి సచివాలయాల నుంచి రైస్‌కార్డుల జారీ సాగుతోంది. కార్డుల కోసం జిల్లాలోని సుమారు 13,500 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో ఇప్పటికే అన్ని రకాల పరిశీలన, విచారణ పూర్తిచేసి 7,150 దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్డులు మంజూరు చేశారు. కార్డుల డేటా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి లాగిన్లోకి వచ్చింది. ఇందులో 4,100 కార్డులను డీఎస్వో విశాఖపట్నంలో ముద్రించి సంబంధిత సచివాలయాలకు పంపించారు. వీటిని వార్డు, గ్రామ వలంటీర్లు ద్వారా పంపిణీ చేస్తున్నారు. మిగతా కార్డుల ముద్రణ జరుగుతోంది. నిరంతర పక్రియ అర్హులకు పది రోజుల్లోనే రైస్‌కార్డు జారీ అవుతుంది. ఇప్పటికే కొందరికి కార్డులు పంపిణీ చేశాం. కొన్ని కార్డులు ముద్రణలో ఉన్నాయి. ఇది నిరంత పక్రియ. ఎవరైనా కార్డులు లేనివారు ఇకపై సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. గతంలో వలే వ్యయప్రయాసలకు గురికావాల్సిన అవసరం లేదు. – ఎ.పాపారావు, డీఎస్వో, విజయనగరం -
సచివాలయాల పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాలయాలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రత్యేకంగా కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటికి ప్రత్యేకాధికారులను నియమించాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ విధానంపై విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణల ఆధ్వర్యంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ, వాటి పర్యవేక్షణ, విధివిధానాలను కమిషనర్ కన్నబాబు వివరించారు. ప్రత్యేక వ్యవస్థగా సచివాలయాలను ముందుకు తీసుకువెళ్లాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఱఅధికార యంత్రాంగానికి బాధ్యతలను అప్పగించడం ద్వారా జవాబుదారీతనాన్ని పెంచుతామని వివరించారు. -
గ్రామ కార్యదర్శులకు బదిలీ
కొత్త నిబంధనలు రూపొందించిన ఏపీ పంచాయతీరాజ్ హైదరాబాద్: గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోల బదిలీలకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ నూతన నిబంధనలను రూపొందిం చింది. ప్రస్తుతం తాను పుట్టిన ఊరులోనో లేదంటే సొంత మండలంలోనే గ్రామ కార్యదర్శులుగా పనిచేస్తున్న వారిప్పుడు ఈ నిబంధనల మేరకు బదిలీ కాక తప్పదు. వాటిపై సంబంధిత శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం తాను జన్మించిన రెవెన్యూ డివిజన్లో పనిచేస్తున్న ఎంపీడీవోలను వేరొక రెవెన్యూ డివిజన్‌కు బదిలీ చేయాలని నిబంధన విధించారు. ఉద్యోగుల బదిలీలకు ఈ నెల 15 వరకు అవకాశం ఉన్నప్పటికీ 11 నాటికే ఈ ప్రక్రియ ముగించాలని అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల విభాగాల్లోని జిల్లా ఎస్ఈలు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయితీ అధికారుల బదిలీల ఫైలుకు మంత్రి శనివారం ఆమోదం తెలిపారు. డిసెంబరు నాటికి .. ఎన్టీఆర్ సుజల ఎన్టీఆర్ సుజల పథకంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటి వరకు 245 నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇప్పటి వరకు ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటి చొప్పన ప్లాంటును ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకొన్నామని డిసెంబర్ ఆఖరు నాటికి ప్రతి మండలంలోనూ కనీసం ఒక ప్లాంటునైనా ఏర్పాటు చేస్తామన్నారు. కార్తీక వనమహోత్సవంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఈ నెల 17న విశాఖ రానున్నారని.. ఈ సందర్భంగా తుపాను సమయంలో బాగా పనిచేసిన అధికారులకు అభినందన కార్యక్రమం ఉంటుందన్నారు.